Mahesh-Teja Sajja: ఒకే కాన్సెప్ట్తో రాబోతున్న రెండు పాన్ ఇండియా సినిమాలు... 14 d ago

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు తెలుగు మూవీస్ లో నటించినప్పటికీ పెద్దగా హిట్ సాధించలేకపోయాడు. ఇక 'హనుమాన్' మూవీతో ఘన విజయం సాధించడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టడంతో తేజ కు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం జై హనుమాన్, మిరాయ్ వంటి పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త వైరల్గా మారింది. మిరాయ్, SSMB-29 ఒకే ఆలోచనలతో రాబోతున్నట్లు సమాచారం. ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు వీరిద్దరి కెరీర్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.